ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలను జనసేన అధికారికంగా ప్రకటించింది. శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ సహా 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనసేన అభ్యర్థులు బరిలో దిగనున్నారు. మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి దశలో మార్గనిర్దేశం చేస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.