తెలంగాణలోని వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన జనసేన ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ రథాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జనసేన అభ్యర్థి డా. గడల శ్రీనివాసరావుకు సూచనలు చేశారు. ఈ రథం ఎన్నికల ప్రచారానికే పరిమితం కాకుండా యువత సమస్యలను తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగాలని ఆకాంక్షించారు.