కూటమి సీట్ల పంపకంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తం 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనసేనకు 7, టీడీపీకి 5 స్థానాలు కేటాయించారు. తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, ముమ్మిడివరం, అమలాపురం, నిడదవోలు జనసేనకు దక్కగా.. ఏలేశ్వరం, పెద్దాపురం, రామచంద్రపురం, మండపేట, కొవ్వూరు టీడీపీకి కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి ఎక్కువ స్థానాలు దక్కినా ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేనకు అధిక కేటాయింపులు జరగడం విశేషం.