పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపల్ చైర్మన్ స్థానాలు రెండూ జనసేనకే కేటాయించాలని ఆ పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీకి కనీసం ఒక స్థానం దక్కాలని వర్మ వర్గం కోరుతున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. కూటమి చైర్మన్ స్థానాల కేటాయింపు జాబితా కాసేపట్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుది నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.