ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అక్టోబర్ 12న విడుదలైన అధికారిక గెజిట్ ప్రకారం పిఠాపురం మున్సిపాలిటీ ఎస్సీ జనరల్‌కు, గొల్లప్రోలు నగర పంచాయతీ అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు.