రాకోట గ్రామ పర్యటనలో శిథిలావస్థలో ఉన్న మండల పరిషత్ పాఠశాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. భవనం పరిస్థితిని తెలుసుకున్న వెంటనే మరమ్మతుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. చిన్నారులను పలకరించి, వారికి తినుబండారాలు అందించారు. గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి మరో రూ.15 లక్షలు కేటాయించారు.