రాకోట గ్రామ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎదుట గిరిజన మహిళ కుర్ల సరస్వతి కన్నీటిపర్యంతమయ్యారు. గతంలో రోడ్డు సౌకర్యం లేక గర్భిణులను దుప్పట్లతో డోలీలు కట్టి ఆసుపత్రులకు తరలించేవారమని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.