కె.కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామపంచాయతీలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జనసేన పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సమాచార సేకరణ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు కుంచా అంజిబాబు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, స్వచ్ఛత, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని అంజిబాబు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.