రామచంద్రపురం నియోజకవర్గం, వెలంపాలెం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త యడ్ల రామఆంజనేయులు గారి అకాల మరణం పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయమైనవి. జనసేన పార్టీ తరఫున యడ్ల రామఆంజనేయులు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాం.