పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు ప్రాజెక్టు ప్రధాన కాలువ కిర్లంపూడి వద్ద చెత్తతో మూసుకుపోవడంతో సుమారు 6,000 ఎకరాల సాగుభూమికి నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతుల సమస్యను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆదేశాల మేరకు రూ.10 లక్షల ప్రత్యేక గ్రాంట్ మంజూరైంది. ప్రస్తుతం కాలువ పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనులను పరిశీలించిన రైతు సంఘాల ప్రతినిధులు, రైతు నాయకులు రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయం
పవన్ కళ్యాణ్ చొరవతో ఏలేరు కాలువ పనులకు వేగం.. రైతుల్లో హర్షం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి41 వీక్షణలు