NEET-UG 2026 పరీక్షల వివాదం, దేశవ్యాప్తంగా సాగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా లేఖను పంపారు. మే 3న జరిగిన పరీక్షలో అక్రమాలు వెలుగులోకి రాగానే సీబీఐ విచారణకు ఆదేశించి, జూన్ 21న విజయవంతంగా రీ-ఎగ్జామ్ నిర్వహించామని ఆయన గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను దేశవ్యతిరేక శక్తులు వాడుకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. విద్యార్థులు రాజకీయం వైపు కాకుండా చదువు, కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని కోరారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీజగన్నాథుని ఆశీస్సులతో భవిష్యత్తులోనూ ఒడిశా ప్రజలకు, దేశ యువతకు సేవ చేస్తానని లేఖలో పేర్కొన్నారు.