ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జనసైనికుడు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్, సీనియర్ నాయకులు వరుపుల తమ్మయ్య బాబు గారి మరణం జనసైనికులకు తీరని లోటు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన సేవలు అపారమైనవి. వేలాది మంది జనసైనికులు, వీర మహిళలను తయారు చేసి నియోజకవర్గంలో పార్టీని గ్రామ, మండల స్థాయిలో బలపరిచారు.
పేద ప్రజలకు అండగా నిలుస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి తగిన న్యాయం చేసి అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని జనసైనికులు వినమ్రంగా కోరుతున్నారు.
“ప్రజల కోసం చేసిన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.”
వరుపుల తమ్మయ్య బాబు గారికి భావపూర్వక నివాళులు. 🙏
రాజకీయం
వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబానికి న్యాయం చేయాలి

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి32 వీక్షణలు