పిఠాపురం నియోజకవర్గం, చేబ్రోలు గ్రామానికి చెందిన జనసైనికుడు కోరకంటి నాగబాబు దుబాయ్‌లో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. తన కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సహాయం చేయాలని ఆయన తల్లి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థించగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ శ్రీ కొణిదల నాగబాబు గారి ఆదేశాల మేరకు మరియు కాకినాడ ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారి సూచనలతో జనసేన నాయకులు నల్లం శ్రీనివాస్, దొమాదల కిషోర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా దుబాయ్ జనసేన నాయకుడు శ్రీ త్రిమూర్తులు గారితో కుటుంబ సభ్యులను ఫోన్లో మాట్లాడించి ధైర్యం చెప్పడమే కాకుండా, మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే మృతుడికి కంపెనీ నుండి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో కూడా త్రిమూర్తులు గారితో సమన్వయం చేస్తూ, ఈ క్లిష్ట సమయంలో జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పార్టీ నాయకులు నల్లం శ్రీనివాస్ గారు భరోసా ఇచ్చారు.
రాజకీయం
దుబాయ్ లో పిఠాపురం జనసైనికుడు మృతి అండగా నిలిచిన నాగబాబు గారు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి7 వీక్షణలు