ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, సంతోషకరమైన ప్రజా జీవితం గడుపుతూ, ఆయన ద్వారా లబ్ధి పొందిన కోట్లాది కుటుంబాల సుఖ సంతోషాలను మరెన్నో సంవత్సరాల పాటు చూడాలని కాంక్షిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. కాకినాడ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి సూచనల మేరకు, ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ మేడిశెట్టి సూర్య కిరణ్ (కత్తిపూడి బాబి) గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది.
శంఖవరం మండలం అన్నవరం గ్రామంలోని ప్రఖ్యాత శ్రీ శ్రీ శ్రీ అనంత లక్ష్మీ సమేత వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ "ఆయుష్ హోమం" నిర్వహించారు. ప్రజా క్షేమం కోసం నిరంతరం తపించే తమ నాయకుడికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని జనసేన శ్రేణులు ఈ సందర్భంగా ఆకాంక్షించాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా హోమం నిర్వహించి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ దాసం శేషారావు, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు శ్రీ కరణం సుబ్రహ్మణ్యం, ఏలేశ్వరం మండల అధ్యక్షులు శ్రీ పెంటకోట మోహన్, శంఖవరం మండల అధ్యక్షులు శ్రీ గాబు సుభాష్, ప్రత్తిపాడు మండల అధ్యక్షులు శ్రీ రామకుర్తి కామేష్ మరియు ఇతర మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, PACS డైరెక్టర్లు, సర్పంచ్‌లు, ATMA కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు తమ అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి క్షేమం కోరుతూ నిర్వహించిన ఈ హోమంలో భాగస్వాములయ్యారు.
అలాగే ఈ కార్యక్రమానికి పిఠాపురం నుండి సీనియర్ జనసేన పార్టీ నాయకులు శ్రీ ప్రకాష్ గారు, కాకినాడ సిటీ నుండి వచ్చిన వీర మహిళలు శ్రీమతి దారపు శిరీషా రెడ్డి, శ్రీమతి మోర్త మాలతి గారు ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి మండలాలకు చెందిన ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని హోమంలో పాల్గొన్నారు.
రాజకీయం
కత్తిపూడి బాబి ఆధ్వర్యంలో అన్నవరంలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి "ఆయుష్ హోమం"

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి6 వీక్షణలు