ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదాల్లో మృతి చెందిన 14 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.70 లక్షల బీమా చెక్కులు పంపిణీ చేశారు. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం పథకం వల్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు.