మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సరికొత్త పంథాలో అడుగులు వేశారు. 'Janasenani with Gen Z' పేరుతో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో హైలెట్స్

యువత ప్రశ్న - పవన్ కళ్యాణ్ జవాబు: రాజకీయాల్లో మార్పు ఎప్పుడు?
రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే ఏం చేయాలని అడిగిన యువతకు, పవన్ కళ్యాణ్ గారు అదిరిపోయే సమాధానం ఇచ్చారు. నాయకులు ఒక పని చేస్తామంటే అది "ఎలా చేస్తారు?" (Way forward) అని అడిగే స్థాయికి ప్రజలు ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.
2. క్రీడాకారుల కష్టాలపై జనసేనాని స్పందన:
వాలీబాల్ క్రీడాకారిణి అడిగిన సమస్యపై స్పందిస్తూ.. మన దేశంలో అద్భుతమైన విధానాలు (Policies) ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో అమలు (Implementation) లో లోపాలున్నాయని పవన్ గారు అన్నారు. క్రీడాకారులు ధైర్యంగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, తాను కూడా తన వంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
3. ఓటుకు నోటు.. ప్రజాస్వామ్యానికి చేటు:
ఎన్నికల్లో డబ్బు ప్రభావంపై పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పేదలే కాదు, విద్యావంతులు కూడా డబ్బు ఆశించడం దురదృష్టకరమని, ఇది వ్యవస్థపై నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుందని అన్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సింది నేటి యువతేనని (Gen Z) ఆయన స్పష్టం చేశారు.
4. పవన్ కళ్యాణ్ ఇచ్చిన 'సక్సెస్ మంత్ర' - బాధ్యత!
నేటి తరం యువతకు ఉండాల్సిన అతిముఖ్యమైన లక్షణం "బాధ్యత" (Responsibility) అని పవన్ గారు చెప్పారు. కేవలం హక్కుల గురించి కాకుండా, సమాజం పట్ల మన బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. స్క్రీన్లకే పరిమితం కాకుండా బయటి ప్రపంచంలోకి వచ్చి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని హితబోధ చేశారు