ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో
తన అభిమానుల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండేవాడు కాదని అన్నారు. “మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు… మీ ప్రేమే నా బలం” అని చెప్పారు.
“ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా గబ్బర్ సింగ్ లాంటి భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే తుది తీర్పు మాత్రం ప్రేక్షకులదేనని అన్నారు. చివరగా అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.