జనసేన పార్టీ జాతీయ అధ్యక్షుడు Pawan Kalyan Garuఆదేశాలతో వరుపుల తమ్మయ్య బాబు ఆశయ సాధనకు అనునిత్యం కృషి చేస్తానని వరుపుల దుర్గ వేణి తెలిపారు. శనివారం లింగంపర్తిలో నిర్వహించిన జనసేన పార్టీ 13వ ఆవిర్భావ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, నియోజకవర్గంలో తన భర్త లేని లోటును తీరుస్తానని జనసైనికులకు భరోసా ఇచ్చారు.
మొదటగా లింగంపర్తి సెంటర్లో తమ్మయ్య బాబు విగ్రహం వద్దకు భారీ ఊరేగింపుగా చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచే కాకుండా, ఆయన సినిమా రంగంలోకి వచ్చిన కాలం నుంచే తన భర్త తమ్మయ్య బాబు పవన్ కళ్యాణ్‌కు అభిమాని అని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించి, 2019 ఎన్నికల్లో జనసైనికుల మద్దతుతో పోటీలో పాల్గొన్నారని తెలిపారు. ఆయన మరణానంతరం నియోజకవర్గంలోని జనసైనికులు, కార్యకర్తలు, తమ్మయ్య బాబు అభిమానులు వేలాదిమంది తనను కలసి ఆ లోటును భర్తీ చేయాలని కోరుతున్నారని చెప్పారు. తాను కూడా పవన్ కళ్యాణ్ ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
జనసైనికులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు. ఒక సందర్భంలో తమ్మయ్య బాబును గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
అలాగే జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మేకల కృష్ణ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జె అన్నవరం ఉపసర్పంచ్ కాలారి శ్రీను, భద్రవరం సర్పంచ్ కూనప రెడ్డి సుబ్బారావు తదితరులు మాట్లాడుతూ, తమ్మయ్య బాబు తన కార్యకర్తను కాపాడుకోవడానికి వెళ్లిన ఘటనను కొంతమంది కావాలని టార్గెట్ చేసి అతిశయంగా చూపించడంతో పార్టీ సస్పెండ్ చేసిందన్నారు. అనంతరం అనేకసార్లు పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేకపోయామని తెలిపారు. ఈ విషయంపై తమ్మయ్య బాబు అనేకసార్లు తన అనుచరులు, పార్టీ శ్రేణుల వద్ద బాధ వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేస్తారని, త్వరలో మళ్లీ యథావిధిగా పార్టీ కార్యకలాపాల్లో కొనసాగుతానని తమ్మయ్య బాబు పలువురితో చెప్పినట్లు వారు తెలిపారు. అన్ని సర్దుకుంటాయని భావించేలోపే ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసైనికుల కోరిక మేరకు జనసేన పార్టీ ఇచ్చిన హామీ త్వరగా నెరవేరుతుందని ఆశిస్తూ కన్నీటి పర్యంతమైన జనసేన వీర మహిళ, లింగంపర్తి ఎంపీటీసీ వరుపుల సత్యవేణిని ఓదార్చారు. మార్చి 17 వరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదులు పొడిగించడంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తిరిగి సభ్యత్వ నమోదు చేపట్టి లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతానని దుర్గ వేణి జనసైనికులు, కార్యకర్తలు మరియు తన భర్త అభిమానులకు పిలుపునిచ్చారు.
నియోజకవర్గంలోని జనసైనికులు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రాజకీయం
తన భర్త తమ్మయ్య బాబు ఆశయాలతో ముందుకు వెళ్తా – జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవంలో వరుపుల దుర్గ వేణ

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి109 వీక్షణలు