చెప్పులు కుట్టే అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు.. కానీ ఎంతోమంది అబ్రహం లింకన్ లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు..!! ఇది ఠాగూర్ సినిమాలోని చిరంజీవి డైలాగ్..!!
అదేవిధంగా జనసేన పార్టీలో పార్టీ కోసం కష్టపడ్డ చాలామందికి నామినేటెడ్ పదవులు లభించాయి..!!
ఇంకా కష్టపడ్డ చాలామందికి పదవులు రావాల్సి ఉంది..!!
ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం పదవులు వచ్చిన వారిని స్టేజి మీదకి పిలవడం...లో భాగంగా
పదవులు రాని సీనియర్లను సైతం పక్కనపెట్టి... ఏ పదవి లేని వారిని స్టేజి పైకి పిలవడం వల్ల... ఎంత కాలంగా పార్టీని మోస్తూ
ఉన్న సీనియర్ నాయకులకు ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది..!! ఒకపక్క ఏ పదవి రాలేదని ఇబ్బంది పడుతూ..
మరోపక్క ఇలాంటి అవమానాలు జరగడం... ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి..!! దయచేసి ఇలాంటి పరిస్థితిని భవిష్యత్తులో ఎవరూ...ఎవరికీ కల్పించవద్దు..!! ప్రోటోకాల్ తో పాటు సీనియారిటీ కి కూడా ప్రాధాన్యత ఇద్దాం..!! అంతా మనవాళ్లే కదా..!!
గౌరవించుకుందాం..!! 🙏🙏🙏🙏