ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో నవంబర్ 5న జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ను యథావిధిగా నిర్వహించాలా? వాయిదా వేయాలా? అనే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేడు ఉదయం 11 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాల ప్రభావం, పోలింగ్ కేంద్రాల పరిస్థితులు, ఓటర్లు, సిబ్బంది భద్రతపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మీడియా సమావేశంలో నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం.