పోలవరం: పోలవరం జిల్లా ఎటపాక మాజీ జడ్పీటీసీ, సీనియర్ నాయకురాలు ఉబ్బా సుష్మిత మంగళవారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సమక్షంలో పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేస్తానని సుష్మిత పేర్కొన్నారు.