ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల సమయంలో అభ్యర్థులను అడ్డుకున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో తుది అభ్యర్థుల జాబితా విడుదలను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. నామినేషన్ల గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది.