అమలాపురం మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి, జనసేన నేత నల్లా శ్రీధర్ నేడు (అక్టోబర్ 18) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు గడియార స్తంభం వద్ద నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొనాలని నల్లా శ్రీధర్ కార్యాలయం పిలుపునిచ్చింది.