పిఠాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జనసేన ప్రకటించిన డా. బీరా విజయశేఖర్ (MBBS, DCH) ప్రభుత్వ వైద్యుడిగా సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి. 2000 నుంచి పిఠాపురం సహా పలు ప్రాంతాల్లో వైద్య సేవలందించారు. ప్రస్తుతం కాకినాడ GGHలో పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వైద్య సేవలు, ఉచిత వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు సహాయం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘ప్రజాసేవే లక్ష్యం.. పిఠాపురం అభివృద్ధే ధ్యేయం’ అని పేర్కొన్నారు.