కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ధీమా
కాకినాడ, అక్టోబర్ 17: ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి నాయకుల మధ్య సమన్వయం, ఎన్నికల్లో విజయ సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి వార్డులో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకులందరూ సమిష్టి బాధ్యతతో పనిచేసి ప్రజల మద్దతును కూడగట్టుకోవాలని స్పష్టం చేశారు.సమిష్టి కృషితో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించి, ఆ విజయాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానుకగా అందిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని ఎంపీ నాయకులకు సూచించారు. ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల బాబు, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్చార్జి డా. చిక్కాల వరలక్ష్మి, డా. బుర్ర దివ్యరాజ్, ఓదూరి కిషోర్, చల్లా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాజకీయం
పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో జనసేన విజయం తథ్యం*

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి37 వీక్షణలు