కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్)లో జనసేన పార్టీ “ఉద్యమి” సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ యల్లటూరు శ్రీనివాస రాజు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాస రాజు గారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కష్టపడే జనసైనికులకు గుర్తింపు ఇస్తూ, వారికి నాయకత్వ బాధ్యతలు కల్పించే కార్యక్రమమే “ఉద్యమి” సభ్యత్వమని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరిని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఉద్యమి సభ్యత్వ నమోదు చేస్తున్న సాధక్‌లను అభినందిస్తూ, మరింత అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ సాధక్‌లు పాల్గొన్నారు.
రాజకీయం
రాజంపేటలో జనసేన ఉద్యమి సభ్యత్వ సమీక్ష సమావేశం

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి11 వీక్షణలు