చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ గుర్రం రఘురామ్ చౌదరి, ప్రముఖ ఐటీ నిపుణులు శ్రీ ఎన్. మునికేశవ్ (కిరణ్) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్ళూరి గారు పార్టీ కండువా కప్పి వారికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడుతూ.. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తూ కూటమి పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయం
చిత్తూరు జనసేనలో చేరికలు

సవరణ / సమాచారం పంపండి
ఈ వార్తలో తప్పు లేదా అదనపు సమాచారం ఉంటే వార్త లింక్‌తో మాకు తెలియజేయండి.
మీ అభిప్రాయం పంచుకోండి9 వీక్షణలు