కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి నివాసంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన క్రియాశీలక సభ్యత్వాలు చేస్తున్న సాధక్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు అధ్యక్షతన మరియు జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పర్యవేక్షణలో జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, జగ్గంపేట నియోజకవర్గంలో గత సంవత్సరం కంటే ఈసారి మరింతగా సభ్యత్వాలు నమోదు చేయాలని సాధక్‌లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన సాధక్‌లు పాల్గొన్నారు. ✊🔥