అనంతపురంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం 15వ డివిజన్‌లో ఉత్సాహంగా నిర్వహించామని జనసేన మహిళా నాయకురాలు సాయి శరణ్య తెలిపారు. తేజస్ రాయల్‌కు మద్దతుగా గడపగడపకు తిరిగి ప్రజలకు పార్టీ సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలు, పార్టీ అభిప్రాయాలు మరియు ప్రజలకు అండగా ఉండే విధానాన్ని వివరించామని చెప్పారు. యువతకు జనసేన ద్వారా లభించే అవకాశాలపై అవగాహన కల్పించామని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆమె పేర్కొన్నారు.