మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు నివాళులు – మంత్రి మనోహర్‌ను పరామర్శించిన కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన-పార్టీ యువ నాయకులు వరుపుల సాయికిరణ్.
ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారి మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా విషాదం నెలకొంది. ప్రజాసేవలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు నాయకులు నివాళులర్పిస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నాదెండ్ల మనోహర్ గారిని కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన-పార్టీ యువ నాయకులు వరుపుల సాయికిరణ్ పరామర్శించి.భాస్కరరావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.