ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన లెజెండ్ Sachin Tendulkar ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. “గాడ్ ఆఫ్ క్రికెట్”గా పేరుగాంచిన సచిన్, తన అద్భుత ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించారు.

16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్, తన కెరీర్‌లో అనేక రికార్డులు సృష్టించాడు. టెస్ట్ మరియు వన్డేల్లో కలిపి 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.

2011 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సచిన్, భారత క్రికెట్‌కు అపార సేవలు అందించాడు. ఆయన సూటి డ్రైవ్, క్లాస్ బ్యాటింగ్ స్టైల్ ఇప్పటికీ అభిమానులను మంత్ర ముగ్ధులను చేస్తోంది.

క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు భారత రత్న పురస్కారం అందించింది. ఈ సందర్భంగా అభిమానులు, క్రీడాకారులు, ప్రముఖులు సచిన్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.