ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నిరంతర దిశానిర్దేశంతో పిఠాపురంలో మొంథా తుపాను అప్రమత్తత చర్యలు ముమ్మరం. యంత్రాంగం సర్వసన్నద్ధం. 25 పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగు నీరు, మందులు, జనరేటర్లు ఏర్పాటు. 34 మందితో NDRF బృందం, 34 బోట్లు సిద్ధం. తీర ప్రాంత గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియామకం. విద్యుత్ పునరుద్ధరణకు 500 స్టాండ్ బై స్తంభాలు, పశుగ్రాసం సిద్ధం. జిల్లా ఉన్నతాధికారులతో గంట గంటకు ఉప ముఖ్యమంత్రి సమీక్ష. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం.